ఐశ్వర్యా రాజేష్ షాకింగ్ కామెంట్స్

తెలుగమ్మాయి  ఐశ్వర్యా రాజేష్ తమిళంలో బాగా రాణిస్తోంది. రీసెంట్ గా మెగా డైరెక్టర్ మణిరత్నం సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అంతేకాదు తన ఇంటర్వ్యూలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేసింది.

తాను ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల బారిన పడ్డానని తెలిపింది. హీరోయిన్లు ఎప్పుడూ వాడే ఎడ్జస్ట్ మెంట్ అన్న పదం తనకు కూడా ఎదురైందని తెలిపింది. కాని ఇప్పుడు తాను ఆ పరిస్థితిలో లేనని తెలిపింది. ఎవరైనా ఆ మాట అంటే సోషల్ మీడియాలో వారిని చీల్చి చెండాడవచ్చని చెప్పింది. దీంతో అలాంటి మాటలు వాడేందుకు చాలా మంది భయపడుతున్నారని పేర్కొంది. 

యాక్టర్ రాజేశ్ కుమార్తెగా డాడీ సినిమాతో బాలీవుడ్ లోనూ ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇచ్చింది. తనకు హిందీ అంటే ఏంటో తెలియకుండానే తన ఎంట్రీ జరిగిపోయిందని తెలిపింది. ప్రెజెంట్ కోలీవుడ్ స్టార్స్ తో కలిసి నటించడం ఆనందంగా ఉందని తెలిపింది. అవకాశం వస్తే భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తానని అంటుంది అమ్మడు.