వర్మకి రేవతి స్వీట్ వార్నింగ్..!

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. కొన్ని సార్లు ఆయన తన ఫ్యామిలీ మెంబర్స్ కి చెందిన ఫొటోలను షేర్ చూస్తూంటారు. ఇలాగే ఇటీవల ఆయన తన తల్లితో దిగిన ఫొటోను షేర్ చేశారు. దీనికి ఫుల్ క్రేజ్ వచ్చింది.

ఆయన రీసెంట్ గా తన కూతురు రేవతి జిమ్ చేస్తోన్న వీడియోను పోస్ట్ చేశారు. నా కూతురు నన్ను కొట్టేందుకు తనంతట తానే ట్రైనింగ్ అవుతోంది అంటూ కామెంట్ చేశారు. అయితే ఈ పోస్ట్ పై రేవతి ఫైర్ అయిందట. పర్సనల్ గా తండ్రికి పంపిన వీడియోని షేర్ చేయడంతో కోప్పడింది. 

మీకు పర్సనల్ గా పంపిన వీడియోను సోషల్ మీడియాలో ఎందుకు పెట్టారు అంటూ అసంతృప్తిని వ్యక్తం చేసింది. తక్షణం పోస్ట్ ని డిలీట్ చేయాలని సూచించింది. లేదంటే అమెరికా నుంచి వచ్చి నిజంగానే కొడతానని హెచ్చరించింది. తనకు తన కూతురు అలా మెసేజ్ పెట్టిందని వర్మ తెలిపారు.

తన కూతురు నుంచి రక్షించుకునేందుకు కాలేజ్ చదివే సమయంలో నేను చేసిన మార్షల్ ఆర్ట్స్ గుర్తు చేసుకుంటున్నానని చెప్పారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేశారు. మరి ఈ పోస్ట్ పై రేవతి ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది. మొత్తానికి తండ్రి కూతుళ్ళు నెటిజన్లకి మాత్రం నవ్వు తెప్పిస్తున్నారు.