
వినాయక్ రవితేజ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది. మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం రాజా ది గ్రేట్ సినిమా చేస్తున్నాడు. అనీల్ రావిపుడి డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమా తర్వాత విక్రం సిరి డైరక్షన్ లో టచ్ చేసి చూడు సినిమా చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత వినాయక్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట రవితేజ.
కృష్ణ తర్వాత ఈ ఇద్దరు చేయబోయే సినిమా ఇదే అని చెప్పాలి. రవితేజ కెరియర్ లో కృష్ణ సినిమా ఓ క్రేజీ హిట్ మూవీ. కెరియర్ కాస్త అటు ఇటుగా ఉన్న తరుణంలో వినాయక్ కృష్ణ రూపంలో సూపర్ హిట్ ఇచ్చాడు. ఇక బెంగాల్ టైగర్ తర్వాత రవితేజ చేస్తున్న రెండు సినిమాలు ఫలితాలు ఎలా ఉన్నా వినాయక్ తో మళ్లీ హిట్ సినిమానే అవుతుందని అంటున్నారు.
ఖైది నంబర్ 150 తర్వాత మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ తో సినిమా చేస్తున్న వినాయక్ ఆ తర్వాత సినిమా రవితేజతోనే అని ఫిక్స్ అయ్యాడు. మరి ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన మిగతా డీటేల్స్ త్వరలో వెళ్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.