బిచ్చగాడు రీమేక్ లో తెలుగు హీరో

ప్రస్తుతం విజయ్ దేవరకొండ గురించి తెలియని వారంటూ లేరు. అర్జున్ రెడ్డి మూవీతో ఆ రేంజ్ లో స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. ఇక ఆయనకు వరుసగా ఆఫర్లు కూడా వచ్చిపడుతున్నాయి. చేతిలో ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలంటే కనీసం ఆరేళ్ళు పడుతుందట.

ఈ యంగ్ హీరో ఇటు టాలీవుడ్ తో పాటు అటు కన్నడ ఇండస్ట్రీ మీద కూడ కన్నేశాడు. పనిలో పనిగా అక్కడ కూడా మార్కెట్ పెంచేసుకునే స్కెచ్ రెడీ చేశాడు. కోలీవుడ్ లో తెరకెక్కి టాలీవుడ్ లో డబ్బింగ్ ఫిల్మ్ గా రిలీజ్ అయిన బిచ్చగాడు మూవీ సెలెంట్ హిట్ అయింది. కన్నడలో తన ఎంట్రీకి ఈ మూవీనే కరెక్ట్ అని విజయ్ భావిస్తున్నాడట.

విజయ్ ఆంటోని హీరోగా తమిళంలో తెరకెక్కిన మూవీ 'పిచ్చాయ్ క్కారన్'. తెలుగులో 'బిచ్చగాడు'గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ సెలెంట్ గా వచ్చి భారీ వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమాను కన్నడలో రీమేక్ చేయాలని ఓ నిర్మాత ప్లాన్ చేసుకున్నారట. ఆయన విజయ్ దేవరకొండను సంప్రదించినట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. ఇక రీమేక్ లో నటించేందుకు విజయ్ కూడా సముఖంగానే ఉన్నాడని టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడాల్సిందే.