జై లవ కుశ 20 మిలియన్ వ్యూస్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మూవీ 'జై లవ కుశ'. ఈ సినిమాలో తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. వరసుగా జై, లవ, కుశ ఫస్ట్ లుక్, టీజర్లు రిలీజ్ చేశారు. అన్నింటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆడియోకి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

అలాగే రీసెంట్ గా ఎన్టీఆర్ నటించిన అన్ని క్యారెక్టర్లను మిక్స్ చేసి ఓ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇది విడుదల అవుతూనే హల్ చల్ చేసింది. బాహుబలి తర్వాత అంతే వేగంగా అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్ గా రికార్డు సాధించింది. అటు ఫేస్ బుక్.. ఇటు యూ ట్యూబ్ లలో కలిపి ఈ ట్రైలర్ కేవలం ఐదు రోజుల్లో ఏకంగా 20 మిలియన్ వ్యూస్ సాధించింది.

ఒక్క యూట్యూబ్ లోనే 10.5 మిలియన్ వ్యూస్ సాధించింది అంటే క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక లైక్స్ కూడా లక్షలలో వచ్చి పడుతున్నాయి. అసలే ఎన్టీఆర్ కి ఫుల్ క్రేజ్ ఉంది. దీనికి తోడు ఈ సినిమాలో త్రిపాత్రాభినం చేయడంపై కూడా ప్రేక్షకులకు సినిమా పట్ల మరింత ఆసక్తిని కనబరుస్తున్నారు. 

ఇక జై క్యారెక్టర్ అయితే హల్ చల్ చేస్తోంది.  దీంతో పాటు ఈ సినిమా కోసమే సన్నబడిన రాశి ఖన్నా క్యూట్ గా కనిపిస్తూ ప్రేక్షకులను రెచ్చగొడుతోంది. ట్రైలర్ చూసిన వాళ్లు సినిమా రిలీజ్ తర్వాత మరిన్ని ఛాన్స్ కొట్టేయడం గ్యారెంటీ అనుకుంటున్నారు. ఓవరల్ గా అన్ని కలిపి ట్రైలర్ కి భారీగా వ్యూస్ వస్తున్నాయి.