
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలంతా వెంట పడుతుంటే ఓ దర్శకుడు మాత్రం ఎన్.టి.ఆర్ సినిమా అంటే మాత్రం సారీ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెబుతున్నాడట. ఇంతకీ ఎవరా దర్శకుడు అంటే మాస్ అండ్ కమర్షియల్ సినిమాలను తీసే బోయపాటి శ్రీనివాస్ అని తెలుస్తుంది. స్టార్ హీరోలకు ఊర మాస్ ఇమేజ్ తీసుకురావడంలో సక్సెస్ అయిన బోయపాటి ఎన్.టి.ఆర్ తీసిన దమ్ము సినిమా హిట్ అవ్వలేదు కాని ఫ్యాన్స్ కు బాగా నచ్చేసింది.
ఆ సినిమాతో ఎవరికి పోయింది లేదు. రీసెంట్ గా జయ జానకి నాయకా సినిమా తర్వాత బోయపాటి తన తర్వాత సినిమాల లిస్ట్ లో బాలకృష్ణ, చిరంజీవి, మహేష్ పేర్లు చెప్పాడు. తారక్ తో సినిమా ప్రస్తావనే తీసుకురాలేదు. తారక్ తో బోయపాటి మరో సినిమా చేస్తే బాగుండు అన్న ఫ్యాన్స్ ఆలోచనకు ఏమాత్రం సపోర్ట్ దొరకలేదు. అయితే ఇదే విషయాన్ని బోయపాటి దగ్గర ప్రస్థావించినా సరే తారక్ తో సినిమా అంటే మాత్రం వెనుకడుగేస్తున్నాడట. బాలకృష్ణ సలహా మేరకే తారక్ తో బోయపాటి సినిమా చేయట్లేదు అన్నది లేటెస్ట్ రూమర్. ఏది ఎలా ఉన్నా సరే బోయపాటితో తారక్ దమ్ము చూపించే రోజు కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.