సురేష్ బాబు మెచ్చిన 'మెంటల్ మదిలో'..!

చిన్న సినిమాల ఆపద్బాంధవుడిగా మారిన సురేష్ బాబు పెళ్లిచూపులు ఆరేంజ్ హిట్ అయ్యింది అంటే కచ్చితంగా సురేష్ బాబు మహిమే.. ఆ సినిమా దర్శక నిర్మాతల కన్నా సురేష్ బాబు ఎక్కువ లాభ పడ్డాడు. అయితే అలాంటి చిన్న సినిమాకు పెద్ద హెల్పింగ్ హ్యాండ్ గా నిలబడ్డాడు సురేష్ బాబు. 


ఇక మరోసారి అలాంటి సినిమానే వెతికి మరి పట్టుకున్నాడు ఈ దగ్గుబాటి నిర్మాత. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న శ్రీవిష్ణు హీరోగా మెంటల్ మదిలో సినిమా వస్తుంది. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ను పెళ్లిచూపులు నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించారు. ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను సురేష్ బాబు రిలీజ్ చేయడం చూస్తుంటే ఇది కచ్చితంగా మరో పెళ్లిచూపులు అవుతుందని చెప్పేయొచ్చు.