
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాబి కాంబినేషన్ లో తారక్ ఏకంగా మూడు పాత్రలతో వస్తున్న సినిమా జై లవ కుశ. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఎన్.టి.ఆర్ నటనకు ఫిదా అయ్యారట. ఇక సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
మూడు పాత్రలలో ఎన్టీఆర్ వేరియేషన్స్ ఫ్యాన్స్ కు పండుగే అని.. సినిమా మొదటి భాగం కామెడీతో నడిపించి.. సెకండ్ హాఫ్ మాత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా నడిపించాడని తెలుస్తుంది. ముఖ్యంగా ఇంటర్వల్, క్లైమాక్స్ మాత్రం సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్తాయని అంటున్నారు. సెప్టెంబర్ 21న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతుందో చూడాలి.