దిల్ రాజు డేర్ డెశిషన్..!

బడా నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు లెక్కే వేరులా ఉంటుంది. నిర్మాతగా హిట్లు కొడుతూనే డిస్ట్రిబ్యూటర్ గా స్టార్స్ సినిమాలకు భలే లాభాలు పొందుతాడు. ఇక ప్రస్తుతం రిలీజ్ అవనున్న జై లవ కుశ, స్పైడర్ సినిమాలు రెండు దిల్ రాజు కొన్నాడని తెలుస్తుంది. ఇక ఇవే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రం కాంబినేషన్ లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సినిమాను భారీ మొత్తం ఇచ్చి దిల్ రాజు కొన్నాడట.

ఈ సినిమాకు నైజాం రైట్స్ 29 కోట్లు ఇచ్చి దిల్ రాజు సొంతం చేసుకున్నాడని టాక్. ఈ రేంజ్ లో సినిమా అంటే అది కచ్చితంగా సంచలనమే అని చెప్పాలి. త్రివిక్రం మీద నమ్మకం.. పవర్ స్టార్ క్రేజ్ కు ఉన్న ఫాలోయింగ్ ఈ రెండిటిని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను కొనేశాడట. దిల్ రాజు కొన్నాడంటే కచ్చితంగా దానిలో విషయం ఉండే ఉంటుంది. మరి పవర్ స్టార్ సినిమా విషయంలో డేర్ డెశిషన్ తీసుకున్న దిల్ రాజు ఏమేరకు లాభ పడతాడో చూడాలి.