
మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న స్పైడర్ మూవీ ఈ నెల 27న రిలీజ్ అవ్తుంది. తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ గా రానున్న ఈ సినిమాను ఓవర్సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఓవర్సీస్ లో మహేష్ ఫాలోయింగ్ అందరికి తెలిసిందే. అక్కడ తెలుగు సినిమాకు కలక్షన్స్ జోరు పెంచింది మహేష్ బాబే. ఇక ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ మార్కెట్ ను శాసించాలని మహేష్ కంకణం కట్టుకున్నాడు.
ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా 400 స్క్రీన్ లలో రిలీజ్ అవుతుందట. సాధారణంగా 250 స్క్రీన్స్ లో స్టార్స్ సినిమాలు రిలీజ్ అవుతాయి. ఇక బాహుబలి మాత్రమే 600 స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యింది. బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో రిలీజ్ అయ్యేది స్పైడర్ మాత్రమే. ఇక 26న ప్రీమియర్ షోస్ కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారట. ప్రీమియర్స్ ద్వారానే 2 మిలియన్ మార్క్ అందుకోవాలని ప్లాన్.
ఇక సినిమా అనుకున్న రేంజ్ లో హిట్ టాక్ వస్తే మాత్రం 5 నుండి 6 మిలియన్ కలక్షన్స్ కుమ్మేయాలని చూస్తున్నాడు మహేష్. మరి బాహుబలి తర్వాత తెలుగు సినిమా సత్తా చాటాలని వస్తున్న ఈ స్పైడర్ జోరు ఎలా ఉండబోతుంది అన్నది చూడాల్సిందే.