మగధీర కాంబినేషన్ రీపీట్ అవుతుందా..?

చెర్రీ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మగధీర బంపర్ హిట్ అయింది. అంతేకాదు పలు రికార్డును తిరగరాసింది. అప్పట్లో ఈ సినిమా చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. బాహుబలి కంటే ముందే జక్కన్నకు పేరు తెచ్చిన పెట్టిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. 

అప్పటి నుంచి రాజమౌళితో సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతున్న హీరోలు చాలామందే ఉన్నారు. ఈగ హిట్ తర్వాత అమాంతం మౌళీ క్రేజ్ ఆకాశాన్నంటింది. తర్వాత బాహుబలి రికార్డుల గురించి అందరికి తెలిసిందే కదా. ఇదిలాఉంటే కొద్ది కాలంగా చెర్రీ రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోందని ఫిల్మ్ నగర్ లో ఓ వార్త చక్కెర్లు కొడుతోంది.

ఇక చిరు 151 చిత్రం సైరా మూవీ లోగో లాంచ్ కి జక్కన్న వెళ్లాడు. దీంతో ఈ పుకార్లు మరింత ఎక్కువయ్యాయి. అలాగే విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించిన శ్రీవల్లి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా వెళ్లబోతున్నాడు. ఈ రాకపోకలు అన్ని మగధీర కాంబినేషన్ రిపీట్ కోసమేనని ముమ్మర ప్రచారం మొదలైపోయింది. దీంతో మెగా అభిమానులు కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు. రంగస్థలం 1985 తరువాత చరణ్ సెట్స్ పైకి వెళ్లేది రాజమౌళితోనేనని చెప్పుకుంటున్నారు. మరి అదే జరిగితే ఆ సినిమా మగధీర-2 అవుతుందా లేక మరేదైనా సినిమా అవుతుందా అన్నది వేచి చూడాలి.