
కమెడియన్ టర్న్డ్ హీరో సునీల్ హీరోగా 'ఉంగరాల రాంబాబు' మూవీ వస్తోంది. లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీ సెప్టెంబరు 15న రిలీజ్ కానుంది. దీంతో ముందుగా మూవీ యూనిట్ ట్రైలర్ ని రిలీజ్ చేసింది. గిబ్రన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను పరుచూరి కిరీటి నిర్మించారు.
ట్రైలర్ ఆద్యంతం ఆశక్తికరంగా ఉంది. ఇందులో మెగాస్టార్ డైలాగ్ ని సునీల్ విచ్చలవిడిగా వాడేసుకున్నాడు. 'ఖైదీ నంబరు 150' సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన డైలాగ్ గుర్తుండే ఉంటుంది. అదేనండి .. 'ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా .. కాదని బలవంతం చేస్తే కోస్తా' అనే డైలాగ్ ను సునీల్ వాడేసుకున్నాడు. సేమ్ టు సేమ్ చిరు స్టైల్ లో బాడీ లాంగ్వేజ్ కూడా ఉంది.
అలాగే 'పిల్ల బాదం పిక్కలా పిటపిట లాడిపోతోంది', 'రాత్రంతా భక్త ప్రహ్లాద సినిమా చూశానండి, అందుకే లెగడం కొంచెం లేటయిందండి','దేశం వెనక పడిపోవడానికి కారణం మన దగ్గర డబ్బులు లేకపోవడం కాదు..మానవత్వం లేకపోవడం' అనే డైలాగ్స్ కూడా బాగున్నాయి. వేర్వేరు సందర్బాల్లో సునీల్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీలో కీరోల్ లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. స్వగ్రామం కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి పాత్రలో ప్రకాశ్ రాజు ట్రైలర్ లో కనిపిస్తున్నారు. మరి ఈ మూవీతో అయినా సునీల్ ఎక్స్ పెక్ట్ చేసిన హిట్ కొడతాడేమో చూడాలి.