
దర్శకరత్న దాసరి నారాయణ రావు తనయుడు అరుణ్ కుమార్ హీరోగా రెండు మూడు ప్రయత్నాలు చేసినా అంతగా వర్క్ అవుట్ కాలేదు. సపోర్టింగ్ రోల్స్ లో కూడా తన మార్క్ చూపించాలని చూసినా లాభం లేకుండా పోయింది. దాసర మరణంతో అరుణ్ కుమార్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. అంత గొప్ప దర్శకుడి తనయుడి అయ్యుండి పరిశ్రమలో లేకపోవడం ఆశ్చర్యకరం.
అందుకే మరోసారి ముఖానికి రంగేసుకుంటున్నారు అరుణ్ కుమార్. ఈసారి హీరోగా కాదు విలన్ గా కొత్త ప్రయత్నం చేస్తున్నారు దాసరి అరుణ్ కుమార్. అల్లు శిరీష్ హీరోగా వి.ఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న సినిమాతో విలన్ అవతారం ఎత్తుతున్నాడు దాసరి అరుణ్ కుమార్. హీరోగా ఫేడవుట్ అయిన వారంతా విలన్ గా టర్న్ తీసుకుంటున్న ఈ తరుణంలో విలన్ గా సత్తా చాటేందుకు వస్తున్న అరుణ్ కుమార్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.