రెండు వారాలు 22 కోట్లు..!

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి డైరక్షన్ లో వచ్చిన సినిమా అర్జున్ రెడ్డి. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద విజయం దక్కించుకుంది అర్జున్ రెడ్డి రెండు వారాలు పూర్తయినా సరే కలక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. సినిమా ఓవర్సీస్ లో కూడా 5.35 కోట్లతో సంచలనం సృష్టించగా.. తెలుగు రెండు రాష్ట్రాల్లో రెండు వారాలకు అర్జున్ రెడ్డి 22.6 కోట్ల కలక్షన్స్ వసూళు చేసింది.

యువత మనసు గెలుచుకున్న ఈ సినిమాకు వారిని టచ్ చేయడమే కాకుండా సగటు జీవితంలో జరిగే కోణాలను దర్శకుడు సందీప్ రెడ్డి చూపించిన విధానానికి ఫిదా అయ్యారు. అందుకే మొదటి షో నుండి ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. షాలిని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించాడు. సినిమాతో తన రేంజ్ పెంచుకున్న విజయ్ ప్రస్తుతం అర్జున్ రెడ్డి హిట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.