
బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ప్రభాస్ హీరోగా సంపాదించిన సొమ్ముతో ఇప్పుడు వ్యాపారంలోకి దిగుతున్నాడు. ఇంతకీ ప్రభాస్ చేస్తున్న బిజినెస్ ఏంటంటే సూళ్లూరు పేటలో మూడు థియేటర్లను నిర్మిస్తున్నాడట. సూళ్లూరు పేట హైవేలో 7 ఎకరాల భూ విస్తీర్ణంలో ఈ బాహుబలి మల్టీప్లెస్ లు నిర్మిస్తున్నారట. మూడు థియేటర్స్ లో ఒకటి త్రిడి స్క్రీన్ తో ఉంటుందట. 670 సీట్లతో 106 అడుగుల స్క్రీన్స్ తో ఈ థియేటర్ ఉంటుందట. దేశంలోనే ఇంత పెద్ద స్క్రీన్ ఉన్న త్రిడి థియేటర్ గా ఇది క్రేజ్ తెచ్చుకుంటుంది.
ఇక మిగాతావి 170 సీట్ల కెపాసిటీతో రెండు థియేటర్స్ నిర్మిస్తున్నారట. దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో ఈ థియేటర్ నిర్మాణం జరుగుతుదని తెలుస్తుంది. 2018 కల్లా ఈ థియేటర్స్ తయారవుతాయని అంటున్నారు. ప్రభాస్ మొదటిసారి బయత మార్కెట్ గా మొదలు పెట్టిన ఈ థియేటర్లు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతాయని ఆశిద్దాం. ఇక ఇందులోనే రెస్టారెంట్స్, పిల్లలు ఆడుకునేందుకు పార్క్ లాంటివి కూడా ఏర్పాట్లు చేస్తున్నారట.