
మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్. తెలుగు తమిళ భాషల్లో వస్తున్న ఈ సినిమాను ఎక్కువగా కోలీవుడ్ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసేందుకే ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఇక రిలీజ్ అయిన రెండు పాటల్లో హాలీ హాలీ సాంగ్ అయితే పక్కా అరవ వాసన కనిపిస్తుంది. అయితే ఈ సినిమా తెలుగులో ఏమాత్రం బజ్ ఏర్పాటు చేయట్లేదు.
తమిళంలో సెప్టెంబర్ 9న శంకర్, రజినికాంత్ లాంటి వారితో కలిసి సినిమా ఆడియో గ్రాండ్ గా ప్లాన్ చేశారట. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ ఆడియోకి దర్శకధీరుడు రాజమౌళి కూడా అటెండ్ అవుతాడని అంటున్నారు. స్పైడర్ తో మహేష్ తమిళనాట తన సత్తా చాటాలని చూస్తున్నాడు అందుకు జక్కన్న కూడా తన సహకారం అందిస్తున్నట్టు తెలుస్తుంది.
అంతా బాగానే ఉంది కాని సెప్టెంబర్ 17న జరుగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎవరు వస్తారన్నది తేలాల్సి ఉంది. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆరోజు వెంకటేష్ తో పాటుగా కొరటాల శివను గెస్ట్ గా పిలిచి సినిమా గురించి మాట్లాడేలా ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి స్పైడర్ ప్రమోషన్స్ కు రాజమౌళితో పాటుగా కొరటాల శివ కూడా నడుం బిగించడం విశేషం.