
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న సినిమాకు తొలిప్రేమ అనే టైటిల్ ఫిక్స్ చేశారట. రీసెంట్ గా ఫిదాతో సూపర్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్ తన తర్వాత సినిమాను కూడా లవ్ స్టోరీతోనే వస్తున్నాడు. ఇక సినిమా టైటిల్ గా తొలిప్రేమ అని పెడుతున్నారట. ఇది పవర్ స్టార్ టైటిల్ అది కూడా సూపర్ హిట్ మూవీ. కథ కథనాలన్ని ఈ టైటిల్ కు యాప్ట్ అవుతున్నాయని ఈ టైటిల్ నిర్ణయించారట.
లోఫర్, మిస్టర్ ఫ్లాపుల తర్వాత ఫిదాతో కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్ ఆ హిట్ మేనియాను కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ ఘాజి డైరక్టర్ తో సినిమా తీస్తాడని తెలుస్తుంది. చూస్తుంటే మెగా హీరో మంచి కెరియర్ ప్లానింగ్ లో ఉన్నాడని చెప్పొచ్చు.
కథల విషయంలో కొత్తదనం కోసం ప్రాకులాడుతున్న వరుణ్ తేజ్ తన కెరియర్ లో ప్రతి సినిమా ఫిదా లాంటి హిట్ అందుకోవాలని ఆరాటపడుతున్నాడు. మరి తను చేయబోయే సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.