
అర్జున్ రెడ్డి సినిమా ఎంత ఘన విజయం దక్కించుకుందో అదే రేంజ్ గొడవలకు కారణం అయ్యింది. సినిమాలో ఉన్న ముద్దు సీన్ల గురించి జరిగిన నానా రచ్చ తెలిసిందే. అయితే కాంగ్రెస్ నేత విహెచ్ చేసిన ముద్దు సన్నివేశాల విమర్శలకు చిత్రయూనిట్ కన్నా వర్మ ఎక్కువ స్పందించి ఆటాడుకున్నాడు. ఇక సినిమా వచ్చి సూపర్ హిట్ అయినా వారిద్దరి మధ్య గొడవ ఆగలేదు.
ఇక రాను రాను వారు కూడా సైలెంట్ అయ్యారు. అయితే ఇక ఇప్పుడు అర్జున్ రెడ్డి అదేనండి మన విజయ్ దేవరకొండ వర్మను కలిసి అందరికి షాక్ ఇచ్చాడు. వర్మతో విజయ్ సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా వెళ్తుంది. సినిమా హిట్ అయిన జోష్ లో ఉన్న విజయ్ ఆ హిట్ కు పరోక్ష కారకుడు అయిన వర్మను కలిసి తన కృతజ్ఞత తెలిపినట్టు ఉన్నాడు.
ఈ సెల్ఫీలో వర్మ మజిల్స్ చూపిస్తూ కనిపించడం విశేషం. ఇక ఈ ఇద్దరి చనువు చూస్తుంటే త్వరలోనే వర్మ విజయ్ తో సినిమా చేసినా చేస్తాడు అని అందరు అనుకుంటున్నారు. మరి అది ఎప్పుడు ఎలా సాధ్యమవుతుందో చూడాలి.