
మాస్ మహరాజ్ రవితేజ తన వారసుడిని తెరంగేట్రం చేయించే పనిలో ఉన్నాడా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. వారసుల హవా కొనసాగుతున్న తెలుగు పరిశ్రమలో రవితేజ తన తనయుడిని తెరంగేట్రం చేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడట. అయితే రవితేజకు హీరోగా ఎంట్రీ ఇచ్చే కొడుకు ఉన్నాడా అంటే హీరోగా కాదు కాని చైల్డ్ ఆర్టిస్ట్ గా రవితేజ కొడుకు మహాధన్ ను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారట.
ప్రస్తుతం రవితేజ నటిస్తున్న రాజా ది గ్రేట్ సినిమా కోసం హీరో చిన్నప్పటి రోల్ ను ఎవరెవరినో అనుకోగా చివరకు రవితేజ కొడుకునే రవితేజ చిన్నప్పటి పాత్ర చేసేలా ఒప్పించారట. ఇక ఓవిధంగా చెప్పాలంటే రవితేజకు ఇది చాలా ప్రత్యేకమైన సినిమా చెప్పాలి. రవితేజ అంధుడిగా నటిస్తున్న ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మరి స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇస్తున్న మహాధన్ ఎలాంటి ఫీడ్ బ్యాక్ అందుకుంటాడో చూడాలి. రవితేజ లాంటి స్టార్ తనయుడిగా మహాధన్ మీద చాలా భాధ్యత ఉన్నట్టే. అది తను ఎంతవరకు న్యాయం చేయగలుగుతాడో చూడాలి.