సాయి ధరం తేజ్ ఛాలెంజ్..?

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ ప్రస్తుతం జవాన్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉండగా ఆ సినిమా తర్వాత చేస్తున్న కరుణాకరణ్ మూవీ కూడా షూటింగ్ జరుపుకుంటుంది. చిన్నదాన నీకోసం తర్వాత కరుణాకరణ్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సినిమాలో తేజ్ లవర్ బోయ్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా టైటిల్ పై రకరకాల పేర్లు వినపడుతుండగా ఛాలెంజ్ అన్నది ఫైనల్ చేశారని టాక్.

ఇప్పటికే మేన మామ మెగాస్టార్, పవర్ స్టార్ మేనరిజాలతో క్రేజ్ తెచ్చుకుంటున్నాడన్న అపవాదం మోస్తున్న తేజ్ ఇప్పుడు వారి టైటిల్స్ ను వాడేస్తున్నాడని అంటున్నారు. విన్నర్ సినిమాకే ఛాలెంజ్ అన్న టైటిల్ పెట్టాల్సి ఉన్నా మెగా ఫ్యాన్స్ వ్యతిరేకతతో వద్దనుకున్నాడు. కాని ఇప్పుడు వారి మద్ధతుతోనే కరుణాకరణ్ సినిమాకు ఛాలెంజ్ అనే టైటిల్ పెట్టబోతున్నారట. తిక్క, విన్నర్ ఫ్లాపుల తర్వాత రాబోతున్న జవాన్ మీద పూర్తి నమ్మకంతో ఉన్న తేజ్ కరుణాకరణ్ తో చేస్తున్న సినిమాతో కూడా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.