
టాలీవుడ్ లో బ్యాడ్ టైం నడుస్తున్న దర్శకులలో శ్రీను వైట్ల ఒకరని చెప్పొచ్చు. స్టార్స్ సినిమాలతో సూపర్ క్రేజ్ సంపాదించిన ఈ దర్శకుడు ప్రస్తుతం ఫేడవుట్ అయ్యాడని తెలిసిందే. ఆగడు, బ్రూస్ లీ ఈమధ్యనే వచ్చిన మిస్టర్ ఇలా చేసిన ప్రతి ప్రయత్నం విఫలమవడంతో శ్రీను వైట్లతో సినిమా అంటే బాబోయ్ అంటున్నారు స్టార్ హీరోలు.
మిస్టర్ ఫ్లాప్ తో అసలు కనిపించకుండా పోయిన శ్రీను వైట్ల తన కెరియర్ లో మంచి హిట్లు ఇచ్చిన మాస్ రాజాతో మరో సినిమాకు సిద్ధమయ్యాడట. బెంగాల్ టైగర్ తర్వాత టచ్ చేసి చూడు, రాజా ది గ్రేట్ సినిమాలు చేస్తున్న రవితేజ ఈ సినిమాలను పూర్తి చేసి శ్రీనువైట్లతో సినిమా ఫిక్స్ చేశాడట. ఇక రవితేజ ఇచ్చిన ఈ అవకాశాన్ని తేల్చుకునే ప్రయత్నంలో ఉన్నాడట వైట్ల శ్రీను.
తన మార్క్ కథ కథనాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనువైట్ల ప్రతి సినిమాకు రొటీన్ ఫార్ములా ఫాలో అవడంతో దెబ్బ పడింది. అందుకే ఈసారి రవితేజ తో చేసే సినిమాను కొత్తగా ప్రయత్నిస్తున్నాడట. ఇక ఆ సినిమా గురించి మరిన్ని విషయాలు త్వరలో వెళ్లడవుతాయని తెలుస్తుంది.