సాహోలో ప్రభాస్ పాత్ర ఇదే..!

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు 150 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతుంది. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. స్టైలిష్ పోలీస్ గా హై ప్రొఫైల్ తో ప్రభాస్ ప్రెజెన్స్ ఉండబోతుందట. బాహుబలి-2 రిలీజ్ టైంలో ఇట్స్ షో టైం అంటూ టీజర్ తో వచ్చిన సాహో ప్రభాస్ సినిమాను బాహుబలికి ఏమాత్రం తగ్గకుండా వచ్చేలా చూస్తున్నాడట.

ఇక సినిమాలో విలన్స్ గా నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్ లాంటి వారిని పెట్టి ఈ సినిమాపై బాలీవుడ్ లో కూడా క్రేజ్ వచ్చేలా చేశారు. బీ టౌన్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శంకర్ ఎహసన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సాహోలో ప్రభాస్ స్కై ఫైటింగ్ తో పాటుగా వాటర్ లో స్కూబా డైవింగ్ లాంటివి కూడా చేస్తాడని తెలుస్తుంది. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రభాస్ రేంజ్ మరింత పెంచుతుందని అంటున్నారు. మరి సినిమా రేంజ్ ఏంటన్నది జూన్ లో రిలీజ్ తర్వాత చూస్తేనే చెప్పగలం.