
మారుతి డైరక్షన్ లో శర్వానంద్ హీరోగా దసరా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్న సినిమా మహానుభావుడు. బాబు బంగారం తర్వాత మారుతి చేస్తున్న ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఇక వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న శర్వానంద్ ఈ సినిమాలో అతి శుభ్రత అనే రోగంతో కనిపిస్తున్నాడు. సినిమాలో హీరో క్యారక్టర్ ను చూపిస్తూ వదిలిన టీజర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది.
యువి క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాలో మెహెరిన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది. రన్ రాజా రన్ తర్వాత యువి క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ మహానుభావుడు హిట్ గ్యారెంటీ అంటున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ సినిమా మీద మంచి ఇంప్రెషన్ ను క్రియేట్ చేసింది. ఈ ఇయర్ శతమానం భవతి, రాధ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్ మహానుభావుడుగా ఎలా అలరిస్తాడో చూడాలి.