
ఈమధ్య మారిన ప్రేక్షకుల అభిరుచిని బట్టే సినిమాలను కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అంతేకాదు నటీనటులు కూడా తమని తాము కొత్తగా ప్రెజెంట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొత్తగా వచ్చే ఏ సినిమా అయినా సరే విపరీతమైన క్రేజ్ చూచాయగా చెప్పాలంటే ఓ స్టార్ హీరో క్రేజ్ తెచ్చుకుంటుంది. అలాంటి కొత్త కథతోనే వస్తున్నారని హడావిడి చేస్తున్నారు అర్జున్ రెడ్డి టీం.
విజయ్ దేవరకొండ హీరోగా షాలిని ఫీమేల్ లీడ్ గా చేస్తున్న సినిమా అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ముద్దు పోస్టర్స్ తో సినిమాపై పబ్లిసిటీ వచ్చేలా చేసుకున్న చిత్రయూనిట్ సినిమా రన్ టైం గురించి కూడా అందరు మాట్లాడుకునేలా చేశారు. సినిమా రన్ టైం విషయాలను దర్శకుడు ప్రస్తావిస్తూ సినిమా అందరు అనుకున్నట్టుగా 3 గంటల 10 నిమిషాలు ఏమి ఉండదని అన్నారు. సరిగ్గా 3 గంటల 1 నిమిషం సినిమా అర్జున్ రెడ్డి అని అంటున్నారు. అంతేకాదు సినిమా మొత్తం 3 గంటల 40 నిమిషాలు ఫైనల్ కట్ వచ్చిందని కాని దాన్ని 40 నిమిషాలు తగ్గించి వదులుతున్నామని అంటున్నాడు సందీప్ రెడ్డి.
3 గంటలు ఉన్నా సరే సినిమా మాత్రం ఎక్కడ ఆడియెన్స్ కు బోర్ కొట్టించదు అంటున్నారు. మరి ప్రేక్షకుల మీద చాలెంజ్ చేస్తున్న చిత్రయూనిట్ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.