రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ప్రియమణి..!

ఎట్టకేలకు హీరోయిన్ ప్రియమణి తన ప్రేమికుడు ముస్తఫా రాజ్ ను పెళ్లాడారు. ఇరు కుటుంబాల సమ్మతంతో సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో వారి పెళ్లి జరిగింది. ఇక పెళ్లి తర్వాత సంగీత్ మాత్రం గ్రాండ్ గా చేసుకున్నారు. ఆగష్టు 24న ప్రియమని వెడ్డింగ్ రిసెప్షన్ ఉంటుందట. రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా ప్లాన్ చేశారట.

సిని పరిశ్రమకు చెందిన సెలబ్రిటీస్ తో పాటుగా కొందరు ప్రముఖులు ప్రియమణి రిసెప్షన్ కు ఆహ్వానం అందుకున్నారని తెలుస్తుంది. కొన్నాళ్లుగా ముస్తఫా రాజ్ తో ప్రేమాయణం సాగిస్తున్న ప్రియమణి కొద్దిరోజుల క్రితమే ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. పెళ్లికి ఖర్చు ఎందుకు అనుకున్నారో ఏమో పెళ్లి రిజిస్టర్ ఆఫీస్ లో చేసుకుని రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నారు. ప్రస్తుతం సినిమాల్లో కనిపించడం మానేసిన ప్రియమణి రీసెంట్ గా మొదలైన ఈటివి ఢీ 10 డ్యాన్స్ షోలో జడ్జ్ గా కనిపిస్తున్నారు.