సైరా.. థమన్ ఆశ పడ్డాడు కాని..!

ప్రెస్టిజియస్ ప్రాజెక్టులో థమన్ మ్యూజిక్ అందించే అవకాశం వచ్చినా సరే చివరి నిమిషంలో అది చేజారిపోయిందని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా వస్తున్న సినిమా సైరా నరసింహారెడ్డి. సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి థమన్ ను మ్యూజిక్ డైరక్టర్ గా తీసుకుందామని పట్టుబట్టాడట కాని చివరి నిమిషంలో థమన్ ఛాన్స్ ను రెహమాన్ అందుకున్నాడట. 

ఇక మోషన్ పోస్టర్ లో అదరగొట్టిన మ్యూజిక్ మాత్రం థమన్ కంపోజిషన్ లోదే అని అంటున్నారు. వచ్చిన అవకాశాన్ని సూపర్ గా వాడుకున్న థమన్ సినిమా అవకాశాన్ని మాత్రం వదులుకున్నాడట. ఈ విషయంపై థమన్ కాస్త అసంతృప్తిగా ఉన్నాడని టాక్. మెగా హీరోలతో మ్యూజిక్ అందిస్తున్న థమన్ చిరు ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారే సరికి చాలా డిసప్పాయింట్ అయ్యాడని తెలుస్తుంది. ఈ సినిమా మిస్సైనా థమన్ కు మెగాస్టార్ తప్పకుండా మరో సినిమా ఛాన్స్ ఇస్తారని అంటున్నారు.