
మురుగదాస్ డైరక్షన్ లో మహేష్ నటిస్తున్న స్పైడర్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో భారీ బడ్జెట్ తో నిర్మించబడింది. ఇక ఈ సినిమాను అరబిక్ భాషలో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది. గల్ఫ్ దేశాల్లో మహేష్ బాబుకి ఫ్యాన్స్ ఉన్నారు అందుకే స్పైడర్ సినిమాను అరబిక్ బాషలో కూడా రిలీజ్ చేస్తారట.
ఇదవరకు మహేష్ నటించిన అతడు సినిమా పోలాండ్ లో పోలిష్ భాషలో డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగులో కన్నా ఆ సినిమా అక్కడ మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు అరబిక్ భాషలో కూడా స్పైడర్ ను అదే ప్రయత్నంలో భాగంగా రిలీజ్ చేస్తున్నారట. స్పై ఏజెంట్ గా మహేష్ నటిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా స్క్రీన్ షేర్ చేసుకుంది. హారిస్ జైరాజ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా దసరా బరిలో ప్రెస్టిజియస్ సినిమాల మధ్య రిలీజ్ అవుతుంది.