
ఖైది నంబర్ 150 తర్వాత మెగాస్టార్ నటిస్తున్న సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా వస్తున్న సంగతి తెలిసిందే. పరుచూరి బ్రదర్స్ కథ అందిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ కొద్దినిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. అంచనాలను మించి ఈ పోస్టర్ ఉందంటే నమ్మాలి. 'సైరా నరసింహారెడ్డి' టైటిల్ తో వస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ లో రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరహో అనిపించింది.
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా బిగ్ బీ అమితాబ్ కూడా సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారని తెలుస్తుంది. ఇక హేమాహేమీలను సినిమాలో భాగమయ్యేలా చేస్తున్న ఈ మూవీ తెలుగు తమిళ హింది భాషల్లో తెరకెక్కుతుంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ తోనే వారెవా అనేలా చేసుకుంది. చూస్తుంటే ఇది తెలుగు పరిశ్రమ నుండి వస్తున్న మరో బాహుబలి అని చెప్పుకున్నా సందేహం లేదు.