
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక 2019 ఎన్నికల్లో తను స్థాపించిన జనసేన పార్టీ తరపున పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో ఉన్న పవన్ చేస్తున్న త్రివిక్రం శ్రీనివాస్ తర్వాత దాదాపు సినిమాలకు గ్యాప్ ఇచ్చేస్తారని అన్నారు. ఈ నిర్ణయంపై ఫ్యాన్స్ కాస్త నిరాశ పడినా జననేతకు తాము తోడుంటాం అనుకున్నారు.
అయితే సన్నిహితుల సలహా మేరకు పవన్ మనసు మార్చుకున్నాడట. ఎలక్షన్స్ జరిగే ముందు దాకా సినిమాలను తీయాలని ఫిక్స్ అయ్యాడట. ఈ నిర్ణయానికి కారణం దాదాపు పార్టీ అవసరాలకు ఖర్చు పెట్టే మొత్తం సినిమాల ద్వారా సంపాదించాలని చూస్తున్నాడట. మొత్తానికి పవన్ సినిమాల్లో కూడా కంటిన్యూ చేస్తాడు అన్న వార్త పవర్ స్టార్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తెస్తుందని చెప్పొచ్చు.