
పట్టుదలతో ఏదైనా సాధ్యం అనుకునే మొండోడు అతను.. స్వయంకృషితో ఎలాంటి ఉన్నత శిఖరాలనైనా ఎక్కొచ్చనే మొనగాడు అతను.. ప్రాణం ఖరీదుతో మొదలైన ఆయన సిని ప్రస్థానం రీసెంట్ గా వచ్చిన ఖైది నంబర్ 150 దాకా అప్రతిహాతంగా కొనసాగుతూనే ఉంది. తెలుగు సినిమా వెండితెర ఇలవేల్పు అయిన మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
150 ఏళ్ల సిని ప్రస్థానంలో ఎన్నో అవార్డులు మరెన్నో రివార్డులు.. వాటినన్నిటికి మించి కోట్ల మంది అభిమానుల ఆశీర్వాదాలు ఇవన్ని ఆయన్ని మళ్లీ సినిమాల్లోకి రప్పించాయి. రీ ఎంట్రీ మూవీతో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ బాక్సఫీస్ దండయాత్ర మొదలు పెట్టిన కొణిదెల శివశంకర వర ప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది మైతెలంగాణా.కామ్ టీం.