
దేవాకట్ట దర్శకత్వంలో శర్వానంద్, సందీప్ కిషన్, సాయి కుమార్ కలిసి నటించిన సినిమా ప్రస్థానం. రిలీజ్ అయ్యి ఏడేళ్లవుతున్నా సినిమా గురించి మాట్లాడుకునేలా చేసిన ప్రస్థానం ఇన్నిరోజులకు బాలీవుడ్ కు వెళ్తుంది. బాలీవుడ్ యాక్షన్ హీరో సంజయ్ దత్ ఈ సినిమా రీమేక్ చేయాలని చూస్తున్నారట. ఎన్నాళ్ల నుండే ప్రయత్నాలు చేస్తున్నా అది కుదరలేదు. ఇక ఇప్పుడు ఫైనల్ గా ఆ ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు.
త్వరలోనే దేవాకట్టతో ఫైనల్ సిట్టింగ్ ఏర్పాటు చేస్తారట. ఇలాంటి కథలకు బాలీవుడ్ లో ఎక్కువ స్కోప్ ఉంటుంది. ముఖ్యంగా విమర్శకుల ప్రశంసలతో పాటుగా అవార్డ్ విన్నింగ్ కు అవకాశాలు ఉంటాయి. సంజయ్ దత్ నిర్మాణంలో తనే హీరోగా రాబోతున్న ఈ సినిమాలో మిగతా లీడ్ రోల్స్ ఎవరెవరు చేస్తారో చూడాలి. ప్రస్తుతం భూమి సినిమా చేస్తున్న సంజయ్ దత్ ఈ ప్రాజెక్ట్ ను ప్రెస్టిజియస్ గా తెరకెక్కించాలని చూస్తున్నారు.