
నందమూరి బాలకృష్ణ నటించిన 101వ సినిమా పైసా వసూల్ సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతుంది. పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య చేస్తున్న మూవీ కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో రాబోతుంది. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక రీసెంట్ గా రామోజి ఫిల్మ్ సిటీలో మొదలైన ఈ సినిమా షూటింగ్ లో నయన్ లుక్ రివీల్ అయ్యింది. నీరజ కోన కాస్టూం డిజైనర్ గా చేస్తున్న ఈ సినిమాలో నయనతార లుక్ ఆమె రివీల్ చేసింది. చూడచక్కని కట్టు బొట్టుతో నయనతార అదుర్స్ అనేలా ఉంది. ఇప్పటికే సింహా, శ్రీరామరాజ్యం సినిమాలలో కలిసి నటించిన బాలయ్య, నయన్ లు మరోసారి కలిసి నటించనున్నారు.