
ముకుంద సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూజా రీసెంట్ గా అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. సినిమాలో బన్నితో పనిచేసిన అనుభవం గురించి చెబుతున్న పూజా డ్యాన్స్, ఫైట్స్, యాక్షన్ లలో బన్ని సూపర్ అనేస్తుంది. ఇక డ్యాన్సుల్లో అయితే బన్ని ఆంధ్ర మైకెల్ జాక్సన్ అని కితాబు ఇచ్చింది. బన్ని డ్యాన్సుల గురిచి అందరికి తెలిసిందే డ్యాన్స్ లో ఆయన కమిట్మెంట్ గ్రేస్ అబ్బో అదరగొడతాడు.
రీసెంట్ గా ఖమ్మంలో లాట్ మొబైల్ స్టోర్ ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన పూజా హెగ్దె బన్నిని పొగుడుతూ మెగా ఫ్యాన్స్ లో క్రేజ్ పెంచుకుంటుంది. ఇక ఆయనతో సినిమా అంటే కథ కూడా అడుగనని చెప్పేస్తుంది అమ్మడు. కెరియర్ లో సినిమాలైతే చేస్తున్నా మొదటి సక్సెస్ డిజెతో అందుకున్న పూజా ఆ సినిమాను హీరోని తెగ పొగిడేస్తుంది. మరి పూజా ఇచ్చిన ఈ ఆఫర్ బన్ని వినియోగించుకుంటాడో చూడాలి.