
శుక్రవారం రిలీజ్ అయ్యి డీసెంట్ టాక్ సొంతం చేసుకున్న ఆనదో బ్రహ్మ సినిమాకు థియేటర్లు పెంచుతున్నారు. హర్రర్ జానర్ సినిమాలకు ఎప్పుడు మార్కెట్ ఉంటుందని మరోసారి ఈ సినిమా ద్వారా ప్రూవ్ అయ్యింది. సినిమా చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో రావడంతో చూసిన ప్రేక్షకులు సూపర్ అనేస్తున్నారు. తాప్సీ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా పేరున్న ఆర్టిస్టులు ఏమి నటించలేదు.
హర్రర్ జానర్ లో కొత్త కథను మిళితం చేసి మహి వి రాధవ్ చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు. 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో విజయ్, శషి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా సక్సెస్ నిర్మాతల అభిరుచిని తెలియచేస్తుంది. రెగ్యులర్ హర్రర్ సినిమాలు చూసి బోర్ కొట్టిన ప్రేక్షకులకు ఈ సినిమా అలరించిందని చెప్పొచ్చు.
అందుకే మూడు రోజులు ముగిశాయో లేదో సినిమా థియేటర్లు పెంచుతున్నారు. కొన్ని ఏరియాల్లో మంచి థియేటర్లు ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. సినిమా బడ్జెట్ చిన్నదే అయినా దర్శక నిర్మాతలు చేసిన ఈ ప్రయత్నం మెచ్చుకోదగినది.