
అక్కినేని అఖిల్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ విక్రం కుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో కింగ్ నాగార్జున నిర్మిస్తున్నారు. దాదాపు 40 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబడుతున్న ఈ సినిమా టైటిల్ విషయంలో రకరకాల పేర్లు వినపడుతున్నాయి.
ఇక వాటిని క్లియర్ చేసేందుకు నాగార్జున ఓ క్లూ ఇచ్చాడు. 'హలో గురు ప్రేమ కోసమేరా జీవితం' అనే పాటలో అఖిల్ సినిమా టైటిల్ ఉందని ట్వీట్ చేశాడు. అయితే కొందరు హలో గురు అని.. మరికొందరు ప్రేమ కోసమే జీవితం అని అంటున్నారు. కాని ఫైనల్ గా అన్నపూర్ణ బ్యానర్లో మాత్రం 'హలో' అని టైటిల్ రిజిస్టర్ చేయించారట. సో విక్రం డైరక్షన్ లో అఖిల్ చేస్తున్న సినిమా హలో. మొదటి సినిమా డిజాస్టర్ కాబట్టి సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు అఖిల్. టైటిల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తుంది.