
రచయితగా ఉన్న కె.ఎస్ రవింద్ర అలియాస్ బాబి దర్శకుడిగా చేసిన మొదటి ప్రయత్నం పవర్ హిట్ అయ్యింది. పవర్ హిట్ కొట్టేసరికి పవర్ స్టార్ పిలిచి అవకాశం ఇచ్చాడు. అయితే సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో పవన్ అన్ని తానై నడిపించాడు. అది కాక రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి తక్కువ టైంలో అది లాగించేశారు. ఇక అది రిజల్ట్ మీద పెద్ద ప్రభావం చూపించిన విషయం తెలిసిందే.
ఇక అదే సీన్ ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న ఎన్.టి.ఆర్ జై లవ కుశ విషయంలో జరుగుతుందట. సెప్టెంబర్ 21న రిలీజ్ ఫిక్స్ చేసిన ఎన్.టి.ఆర్ సినిమాను సెప్టెంబర్ 10 కల్లా రిలీజ్ చేయాలని డెడ్ లైన్ పెట్టారట. ఈ సినిమా హిట్ కొట్టి తన సత్తా చాటుదాం అనుకున్న బాబికి మళ్లీ పెద్ద చిక్కొచ్చి పడింది. అనుకున్న టైంలో అనుకున్న విధంగా సినిమా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమా రిజల్ట్ మీద బాబి కెరీర్ కూడా ఆధారపడి ఉందని తెలిసిందే.. ఇన్ని భాధ్యతల్లో బాబి సినిమాను ఎలా తెరకెక్కిస్తున్నాడు అన్నది సినిమా వస్తేనే కాని చెప్పలేం.