
అక్కినేని అఖిల్ విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నుండి ఓ లుక్ లీక్ అయ్యింది. ఈ ఫస్ట్ లుక్ లీకే అయినట్టు తెలుస్తున్నా ఫస్ట్ లుక్ మాత్రం అదరగొట్టేసింది. ఓ వైపు ఫైట్ మరో వైపు హీరోయిన్ తో రొమాన్స్ తెలుగు తెర మీద ఇదవరకు ఎప్పుడు కనిపించని ఈ పోస్టర్ అఖిల్ సెకండ్ మూవీలోనిదే అని తెలుస్తుంది.
నాగార్జున నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ నుండి రివీల్ అయిన ఈ లుక్ అక్కినేని ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేసింది. ఇక ఈ సినిమా అసలు లుక్ దీని కన్నా పెద్దది ఆగష్టు 21న రిలీజ్ అవుతుందని ఎనౌన్స్ చేశారు నాగార్జున. ఫస్ట్ లుక్ లీక్ అయినా సరే ఆ లుక్ పై వస్తున్న పాజిటివ్ టాక్ తో అఖిల్ కూడా సంతోషంగా ఉన్నాడని అంటున్నారు. మొత్తానికి అఖిల్ సినిమా ఈవిధంగా హైప్ క్రియేట్ చేసుకుంటుందన్నమాట.