రేసులో రానానే గెలిచాడబ్బా..!

దగ్గుబాటి రానా హీరోగా తేజ డైరక్షన్ లో వచ్చిన సినిమా నేనే రాజు నేనే మంత్రి. సురేష్ బాబు ప్రొడక్షన్ లో వచ్చిన ఈ సినిమా లాస్ట్ ఫ్రై డే రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆగష్టు 11న రిలీజ్ అయిన మూడు సినిమాల రేసులో నెంబర్ 1గా నిలిచాడు రానా. హోరా హోరి తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో తేజ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా అతన్ని హిట్ ట్రాక్ ఎక్కించింది.

తెలుగు రెండు రాష్ట్రాలోనే కాదు ఓవర్సీస్ లో కూడా నేనే రాజు నేనే మంత్రి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. సినిమా మొదటి వారం 15.23 కోట్ల కలక్షన్స్ సాధించి మరోసారి రానా సత్తా ఏంటో తెలిసేలా చేసింది. ఇక అదే రోజు రిలీజ్ అయిన జయ జానకి నాయకా రానా సినిమాతో పాటే మంచి టాక్ తెచ్చుకోగా పోటీలో దిగిన నితిన్ మాత్రం డల్ అయిపోయాడు.

బాహుబలి తర్వాత రానా చేసిన ఈ సినిమా తనకు ప్రత్యేకమైన ఇమేజ్ వచ్చేలా చేసింది. కొత్తదనానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు సపోర్ట్ చేస్తారని మరోసారి ఋజువుచేస్తూ నేనే రాజు నేనే మంత్రి రానా కెరియర్ లో హిట్ సినిమాల ఖాతాలో నిలిచింది.