
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. రీసెంట్ గా ముహుర్త కార్యక్రమాలను పూర్తిచేస్తున్న ఈ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కుతుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా కథను పరుచూరి సొదరులు అందిస్తుండటం విశేషం. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో ట్రైలింగ్వల్ మూవీగా రూపొందిస్తున్నారట.
సినిమా టైటిల్ గా మహావీర్ అని ప్రచారంలో ఉంది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగష్టు 22న రిలీజ్ చేయబోతున్నారు. ఈ లుక్ దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నారట. తెలుగు తమిళం వరకు ఓకే కాని హిందిలో సినిమాపై అంచనాలు పెరిగేలా జక్కన్న సహకారం తీసుకుంటున్నారట. మరి ఈ మహావీర్ గా మెగా లుక్ ఎలా ఉండబోతుందో చూడాలి.