
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మళ్లీ తన తర్వాత సినిమా షూటింగ్ లో బిజీ అవుతున్నాడు. బాహుబలి తర్వాత సుజిత్ డైరక్షన్ లో సాహో సినిమా చేస్తున్న ప్రభాస్ ఆ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో ప్రభాస్ జాయిన్ అయ్యాడు. యువి క్రియేషన్స్ బ్యానర్లో 150 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కుతుంది.
శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శంకర్-ఎహసన్-లాయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. బాహుబలి-2 రిలీజ్ నాడే సాహో టీజర్ రిలీజ్ చేశారు. ఇక త్వరగా అనుకున్న విధంగా షెడ్యూల్ పూర్తి చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం వేసిన సెట్ లో లాంగ్ షెడ్యూల్ చేయనున్నారట. 2018 సమ్మర్ టార్గెట్ తో వస్తున్న సాహో బాహుబలి రికార్డులను బీట్ చేస్తుందో లేదో చూడాలి.