
బ్రిటీష్ బ్యూటీ ఎమీ జాక్సన్ డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది.. ప్రస్తుతం రోబో సీక్వల్ గా వస్తున్న 2.0లో నటిస్తున్న అమ్మడు ఫోటో షూట్స్ తో కూడా ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. అమ్మడు చేసే ఫోటో షూట్స్ కు ప్రేక్షకుల హృదయాలు గిలిగింతలు పెడతాయంటే నమ్మాలి. ఇక ఈమధ్య ఫోటో షూట్స్ తో ఇంకాస్తా రెచ్చిపోతున్న అమ్మడి క్రేజ్ ను వాడాలనుకునే ఓ మేగజైన్ కు ఎమీ అదిరిపోయే షాక్ ఇచ్చిందట.
ఒక్కరోజు కాల్షీట్ తో ఫోటో షూట్ చేస్తామని ఎమీ జాక్సన్ దగ్గరకు రాగా అందుకు ఆమె ఏకంగా 6 కోట్ల దాకా డిమాండ్ చేసిందట. 3 కోట్ల దాకా ఇచ్చే అవకాశం ఉన్నా సరే కాదు కూడదు అని వారికి చుక్కలు చూపించేసిందట. ఒక్క కాల్షీట్ ఈ రేంజ్ లో అడుగుతుంది అంటే ఆ షూట్ లో ఎమీ ఎలాంటి రచ్చ చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. బాలీవుడ్ భామలకు ఏమాత్రం తీసిపోకుండా హాట్ షూట్స్ తో అదరగొడుతున్న ఎమీ జాక్సన్ క్రేజ్ ను బట్టి వచ్చిన అవకాశాలను సెట్ చేసుకుంటుంది.