హర్రర్ కథలకే కొత్త రూపం.. ఆనందో బ్రహ్మ..!

టాలీవుడ్ లో ప్రస్తుతం కొనసాగుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మూవీస్ ఎన్నో వస్తున్నాయని తెలిసిందే. అయితే అదే కథను అటు తిప్పి ఇటు తిప్పి చేస్తున్నారే తప్ప కొత్త ప్రయత్నంగా అసలు సినిమాలు అది కూడా హర్రర్ నేపథ్యంలో కూడా రొటీన్ కథలు వస్తున్నాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో కొత్త కథతో హర్రర్ సినిమాలలోనే ఓ కొత్త రూపం తెచ్చేలా వస్తున్న సినిమా ఆనందో బ్రహ్మ. 

తాప్సీ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్, షకలక శంకర్, తాగుబోతు రమేష్ ఇలా మంచి నటులంతా కలిసి నటించిన ఈ సినిమా ఈ నెల 18 అనగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రమోషన్స్ పీక్స్ లో చేస్తున్న ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి నిర్మించారు. మరి ట్రైలర్ టీజర్ తో అంచనాలను పెంచేసిన ఆనందో బ్రహ్మ సినిమా ఫైనల్ గా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది.