
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ కొరటాల శివ కలిసి ఓ సినిమా చేస్తే.. ఇంకే ఆ సినిమా రికార్డుల సంచలనమే అని చెప్పొచ్చు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ సినిమాల సక్సెస్ తో టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ గా మారిన కొరటాల శివ ప్రస్తుతం మళ్లీ మహేష్ తోనే భరత్ అను నేను సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాక ముందే రాం చరణ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.
ఇక చెర్రి సినిమా తర్వాత సినిమా ఏంటో కూడా ఇప్పటి నుండి ప్లానింగ్ లో ఉన్నాడట. తెలుస్తున్న సమాచారం ప్రకారం కొరటాల శివ బన్ని కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నాడట. అది ఓకే అయితే కనుక ఇక మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయినట్టే. ఈ సినిమా అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మిస్తారని తెలుస్తుంది. బన్నితో కొరటాల శివ సినిమా అనగానే మెగా ఫ్యాన్స్ ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. మరి ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందో లేదో చూడాలి.