బిగ్ బాస్ లో నవదీప్ షాక్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా స్టార్ మాలో వస్తున్న బిగ్ బాస్ లో మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చింది. ఈసారి వచ్చింది ఎవరో కాదు హీరో నవదీప్. సడెన్ గా నవదీప్ పేరు కొద్దిరోజులుగా చెక్కర్లు కొడుతూనే ఉంది. మరి కావాలని హింట్ ఇచ్చారో ఏమో తెలియదు కాని నవదీప్ వచ్చేది ప్రేక్షకులు ముందే గెస్ చేశారు.

బిగ్ బాస్ లో నవదీప్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. అలా ఇలా కాదు ఏకంగా బుల్లెట్ తోనే నవదీప్ హౌజ్ లోకి ప్రవేశించి సందడి చేయడం మొదలు పెట్టాడు. ఇక వెళ్లిన మొదటిరోజే అక్కడ ఏమి అర్ధం కాకున్నా ఈసారి ఎలిమినేషన్ ప్రక్రియలో నవదీప్ దీక్షా, అర్చనలను నామినేట్ చేశాడు.

ఓపెన్ గా ఇంట్లో ఉండటానికి ఎవరు అర్హులంటూ ఇచ్చిన బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా శివబాలాజి నెంబర్ 1, ప్రిన్స్ నెంబర్ 2, ఆదర్శ్ 3, ధన్ రాజ్ 4 ఇలా లిస్ట్ చెప్పి చివరు అర్చననే లాస్ట్ లో ఉంచాడు.