
బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్లో దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా తెలుగు తమిళా హింది భాషల్లో తెరకెక్కిస్తుండటం విశేషం. రన్ రాజా రన్ డైరక్టర్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సాహో షూటింగ్ జరుగుతున్నా హీరోయిన్ ఎవరన్నది మాత్రం క్లారిటీ రాలేదు.
రోజుకో హీరోయిన్ పేరు ఈ సినిమాలో నటిస్తుందంటూ వినిపించగా గత కొద్దిరోజులుగా బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ ఈ లిస్ట్ లో చేరింది. సాహోలో ప్రభాస్ తో జతకట్టేది ఆమే అని అందరు డప్పేసి మరి చెప్పారు. అయితే అందరికి తెలిసినా ప్రభాస్ తో శ్రద్ధా జోడి కన్ఫామా కాదా అన్నది చిత్రయూనిట్ ఎనౌన్స్ మెంట్ కోసం వెయిట్ చేశారు.
ఫైనల్ గా వారు కూడా ఈ వార్తలు నిజమేనని చెప్పేశారు. ప్రభాస్ పక్కన శ్రద్ధ నటిస్తుందని యువి క్రియేషన్స్ నిర్మాతలు కన్ఫాం చేశారు. మొత్తానికి ప్రభాస్ హీరోయిన్ పై ఓ క్లారిటీ వచ్చిందన్నమాట. ఆషికి-2తో సౌత్ లో కూడా మంచి పాపులర్ అయిన శ్రద్ధ తొలిసారి ఓ సౌత్ సినిమా అది కూడా తెలుగు సినిమా చేస్తుండటం విశేషం.