రాజా ది గ్రేట్ టీజర్.. రవితేజ మార్క్ కనిపిస్తుంది..!

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా సుప్రీం డైరక్టర్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా రాజా ది గ్రేట్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో మెహెరిన్ పిర్జాది కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈరోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ టీజర్ తో విష్ చేశాడు రవితేజ. సినిమాలో అంధుడిగా నటిస్తున్న రవితేజ తన స్టైల్ ను ఏమాత్రం తగ్గించుకోలేదని చెప్పొచ్చు.

బెంగాల్ టైగర్ తర్వాత రవితేజ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. పటాస్, సుప్రీం హిట్ కొట్టిన అనీల్ రావిపుడి రవితేజతో చేస్తున్న రాజా ది గ్రేట్ అసలైన మాస్ సినిమాగా వస్తుందని చెప్పొచ్చు. టీజర్ మాస్ రాజా ఫ్యాన్స్ ను మెప్పించేలా ఉంది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

ఇక ఈ సినిమాతో పార్లర్ గా రవితేజ విక్రం సిరి డైరక్షన్ లో టచ్ చేసి చూడు కూడా చేస్తున్నాడు. ఒకేసారి రెండు సినిమాలతో వచ్చి తన సత్తా చాటాలని చూస్తున్నాడు రవితేజ. మరి ఈ సినిమాలు రవితేజకు ఎలాంటి ఫలితన్ని ఇస్తాయో తెలియాల్సి ఉంది.