
తాప్సీ ప్రధాన పాత్రలో వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, తాగుబోతు రమేష్ కలిసి నటిస్తున్న సినిమా ఆనందో బ్రహ్మ. మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగష్టు 18న రిలీజ్ అవుతుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్న సాయంత్రం ఆనందో బ్రహ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు గెస్ట్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అటెండ్ అయ్యారు.
సినిమా నిర్మాతలు విజయ్, శషి దేవిరెడ్డిల ఆహ్వానం మేరకు ముఖ్య అతిధిగా వచ్చారు ప్రభాస్. ఇక సినిమా గురించి ప్రభాస్ మాట్లాడుతూ విజయ్ తో తనకున్న అనుబంధం గురించి చెప్పారు. ప్రతి క్షణం సినిమా గురించే ఆలోచించే విజయ్ ఇండియన్ సినిమాల్లోనే మొదటిసారి మనుషులకు భయపడే దెయ్యం సినిమా కథతో రావడం గొప్ప విషయమని అన్నారు. ఇక సినిమాలో హీరోయిన్ గా తాప్సీ మిస్టర్ పర్ఫెక్ట్ హీరోయిన్ అందాల దెయ్యమని అన్నారు.
సినిమాలో నటించిన నటీనటులంతా వారిని చూస్తేనే నవ్వొస్తుందని కచ్చితంగా ఈ సినిమా పెద్ద విజయం అందుకోవాలని అన్నారు. ఆగష్టు 18న సినిమా రిలీజ్ అని ఎనౌన్స్ చేసిన ప్రభాస్ బయట ఉన్న టాక్ చూస్తుంటే సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అందుకే రిలీజ్ నాడు విజయ్ తనకు పార్టీ ఇవ్వాలని చమత్కరించారు. రిలీజ్ కు మూడు రోజులే ఉండగా సినిమా ప్రమోషన్స్ మీద మరింత గురి పెట్టారు చిత్రయూనిట్.