
తాప్సీ ప్రధాన పాత్రలో మహి వి రాఘవ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆనందో బ్రహ్మ. 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఆగష్టు 18న రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేయగా సినిమా ప్రివ్యూ చూసిన సుధీర్ బాబు సినిమాను ఆకాశానికెత్తేస్తున్నారు.
సినిమా చూసి ప్రేమించదగ్గర మూవీ అంటూ ట్వీట్ చేశారు సుధీర్ అంతేకాదు ప్రేమకథా చిత్రం తర్వాత అంత సస్పెన్స్ తో కూడిన కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని అన్నారు. తనకు భలే మంచి రోజు హిట్ ఇచ్చిన ఈ నిర్మాతలు ఈ ఆనందో బ్రహ్మతో కూడా హిట్ అందుకోవాలని అన్నారు. ఆగష్టు 18న రిలీజ్ అవబోతున్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, తాగుబోతు రమేష్ లు నటించారు.