ఆ ఛాన్స్ కత్రినాకే దక్కింది..!

పూరి డైరక్షన్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన సినిమా టెంపర్. అప్పటిదాకా కెరియర్ సంక్షోభంలో ఉన్న తారక్ కు ఓ క్లారిటీ వచ్చేలా చేసిన సినిమా అది. ఆ సినిమాలో తారక్ తన నట విశ్వరూపం చూపించాడని చెప్పొచ్చు. ఇక ఆ సినిమాను హిందిలో రీమేక్ చేయబోతున్నారు. రోహిత్ శెట్టి దర్శక నిర్మాతగా ఈ సినిమా చేస్తున్నారు. 

రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా ఫైనల్ చేశారట. కెరియర్ అంత జోష్ గా లేకున్నా సరే కత్రినా చేతిలో సల్మాన్,  అమీర్ ఖాన్ సినిమాలు ఉన్నాయి. ఇక రాబోయే షారుఖ్ ఖాన్ సినిమాలో కూడా కత్రినానే నటిస్తుందని తెలుస్తుంది. ఇన్ని సినిమాలున్నా హింది టెంపర్ లో కత్రినా ఛాన్స్ కొట్టేస్తుందని అంటున్నారు. మరి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.