
టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ వి.వి.వినాయక్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా కెరియర్ కొనసాగిస్తున్న వినాయక్ మరో పక్క రాజకీయాల మీద మక్కువ పెంచుకున్నాడు. వినాయక్ పొలిటికల్ ఎంట్రీపై కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నా అవి వాస్తవం కాదని అనుకున్నారు.
కాని రాబోతున్న 2019 ఎలక్షన్స్ లో వినాయక్ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి వినాయక్ ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు.. ఏ పార్టీలో చేరుతున్నారు అన్నదాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. జననేతగా జనసేనతో పవన్, కాంగ్రెస్ లో చిరంజీవి, టిడిపిలో బాలయ్య ఇలా ముగ్గురు టాప్ హీరోలు మూడు పార్టీల్లో ఉండగా వినాయక్ ఎవరికి తన సపోర్ట్ అందిస్తాడో చూడాలి.